Lok Sabha: ప్రతిపక్షాల డిమాండ్ మేరకు జేపీసీకి జమిలి బిల్లు 2 d ago
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు తీసుకు వచ్చిన జమిలి బిల్లును శుక్రవారం లోక్ సభ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. మంగళవారం నాడే లోక్ సభలో మోడీ సర్కార్ ఈ బిల్లును ప్రవేశ పెట్టింది. అయితే ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉందని..వెంటనే, దీన్ని జేపీసీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అన్ని పార్టీలు దీనిపై విస్తృత చర్చ కోరుతున్నందున జేపీసీకి పంపడానికి తమకేమీ అభ్యంతరం లేదని కేంద్రం వెల్లడించింది.